భారతదేశంలోని ప్రతిష్టాత్మక బీమా సంస్థలలో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుంచి యువతకు ఒక శుభవార్త వచ్చింది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) జనరలిస్ట్ పోస్టుల భర్తీకి LIC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం కింద ఉన్న ఆర్టికల్‌ని చదవండి
నోటిఫికేషన్‌లో ముఖ్యమైన వివరాలు :
- సంస్థ పేరు: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)
- ఉద్యోగం పేరు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO-జనరలిస్ట్)
- ఖాళీలు: 350
- అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ
- జీతం: సుమారుగా రూ. 1,26,000/- (నెలకి)
- చివరి తేదీ: 08.09.2025
- అదికారిక వెబ్‌సైట్: www.licindia.in
ఈ ఉద్యోగానికి కావలసిన విద్యా అర్హతల వివరాలు
LIC AAO-జనరలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన ఇండియన్ యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు డిగ్రీని పొందినట్లుగా జారీ చేయబడిన మార్క్‌షీట్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ లోని తేదీ 01.08.2025కు ముందు ఉన్నట్లయితే వారు ఈ పోస్టులకు అర్హులు. ఉద్యోగానికి అర్హతగా భావించే విద్యా అర్హతలు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఉండాలి, ఎటువంటి సమానమైన (equivalent) విద్యార్హతలను LIC పరిగణనలోకి తీసుకోదు
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు పరిమితి వివరాలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస వయస్సు 01.08.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తయి ఉండాలి, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు. అంటే అభ్యర్థులు 02.08.1995 కంటే ముందు లేదా 01.08.2004 తర్వాత జన్మించి ఉండకూడదు. SC, ST, OBC, PwBD మరియు ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.
- PwBD (జనరల్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు.
- PwBD (SC/ST) అభ్యర్థులకు 15 సంవత్సరాలు.
- PwBD (OBC) అభ్యర్థులకు 13 సంవత్సరాలు.
- LICలో పని చేస్తున్న ఉద్యోగులకు 5 సంవత్సరాలు.
అవసరమైన వయస్సు సడలింపులను కోరుకునే అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో అవసరమైన సర్టిఫికెట్లను సమర్పించవలసి ఉంటుంది
అప్లై చేసే వారికి అవసరమైన ఫీజు వివరాలు:
అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు ఫీజును చెల్లించవలసి ఉంటుంది. SC, ST మరియు PwBD అభ్యర్థులు రూ. 85/- ఇంటీమేషన్ ఛార్జీలు, ట్రాన్సాక్షన్ ఛార్జీలు మరియు GSTని చెల్లించాలి. ఈ వర్గాలు మినహా ఇతర అభ్యర్థులందరూ రూ. 700/- అప్లికేషన్ ఫీజు-కమ్-ఇంటిమేషన్ ఛార్జీలు, ట్రాన్సాక్షన్ ఛార్జీలు మరియు GSTని చెల్లించాలి. ఈ ఫీజు నాన్-రిఫండబుల్, అంటే ఒకసారి చెల్లించిన తర్వాత తిరిగి ఇవ్వబడదు. దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ అయిన 16.08.2025 నుంచి చివరి తేదీ అయిన 08.09.2025 వరకు చెల్లించవచ్చు.
ఈ ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపిక జరిగే విధానం:
ఈ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక మూడు దశలలో జరుగుతుంది.
మొదటి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండవది మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది
ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కులను ఫైనల్ మెరిట్ లిస్ట్‌కు పరిగణనలోకి తీసుకోరు. మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కులను మాత్రమే ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్ చేయడానికి పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా రూపొందిస్తారు. మెయిన్స్ పరీక్షకు ఖాళీలకు సుమారుగా 20 రెట్లు ఎక్కువ మందిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. అదేవిధంగా, ఇంటర్వ్యూకి ఖాళీలకు సుమారుగా మూడు రెట్లు ఎక్కువ మందిని ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగంలో లభించే జీతం మరియు ఇతర ప్రయోజనాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ బేసిక్ పే రూ. 88,635/- ఉంటుంది. దీనితో పాటు హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ వంటివి కూడా కలుపుకుని, ‘A’ క్లాస్ సిటీలో సుమారుగా రూ. 1,26,000/- వరకు మొత్తం జీతం లభిస్తుంది. జీతంతో పాటు, ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. వాటిలో డిఫైన్డ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్, గ్రాట్యుటీ, LTC, గ్రూప్ మెడిక్లెయిమ్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, వెహికల్ లోన్ (2-వీలర్/4-వీలర్), మీల్ కూపన్, మొబైల్ ఖర్చుల రీఎంబర్స్‌మెంట్, ఫర్నిచర్ రీఎంబర్స్‌మెంట్ మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు నియమింపబడిన తర్వాత ఒక సంవత్సరం ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది, ఇది రెండు సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. అంతేకాకుండా, అభ్యర్థులు ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి కనీసం నాలుగు సంవత్సరాలు (ప్రొబేషనరీ పీరియడ్‌తో సహా) LICలో పని చేస్తానని బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
అప్లై చేయడానికి చేసుకోవడానికి అవసరమైన ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 16.08.2025
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 08.09.2025
- ప్రిలిమినరీ ఆన్‌లైన్ పరీక్ష తేదీలు : 03.10.2025
- మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష తేదీలు : 08.11.2025
పరీక్ష కాల్ లెటర్స్ ఆన్‌లైన్ పరీక్షకు 7 రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని సకాలంలో దరఖాస్తు చేసుకోవడం మంచిది.
ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు LIC యొక్క అధికారిక వెబ్‌సైట్ www.licindia.in కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు తమ ఫోటోగ్రాఫ్, సంతకం, ఎడమ చేతి బొటనవేలి ముద్ర మరియు చేతితో రాసిన డిక్లరేషన్‌ను స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి,ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంలో అవసరమైన అన్ని వివరాలను నింపి, ఫీజు చెల్లించాలి, అన్ని వివరాలను సరిగ్గా నింపినట్లు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, అప్లికేషన్.
పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ PDF లింక్ చూడండి
- అధికారిక వెబ్‌సైట్ లింక్ : https://www.licindia.in/
- అధికారిక నోటిఫికేషన్ PDF : [Notification PDF]