భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణావకాశం. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా (SCI), న్యూ ఢిల్లీ, ప్రతిష్టాత్మకమైన కోర్ట్ మాస్టర్ (షార్ట్‌హ్యాండ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇది ఒక గెజిటెడ్ పోస్ట్, దీనికి ఎంపికైన అభ్యర్థులకు అద్భుతమైన జీతంతో పాటు గౌరవప్రదమైన కెరీర్ లభిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న భారతీయ పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం కింద ఉన్న ఆర్టికల్‌ని చదవండి.
నోటిఫికేషన్‌లో ముఖ్యమైన వివరాలు
| సంస్థ పేరు | సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా |
|---|---|
| ఉద్యోగం పేరు | కోర్ట్ మాస్టర్ (షార్ట్‌హ్యాండ్) |
| ఖాళీలు | 30 |
| జీతం | నెలకు ₹67,700/- ప్రారంభ బేసిక్ పే + ఇతర అలవెన్సులు |
| ప్రారంభ తేదీ | త్వరలో వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు |
| చివరి తేదీ | త్వరలో వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు |
| అధికారిక వెబ్‌సైట్ | www.sci.gov.in |
ఈ ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు
ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 01.07.2025 నాటికి నిర్దేశించిన విద్యార్హతలు మరియు అనుభవం కలిగి ఉండాలి. కేవలం అర్హతలు ఉన్నంత మాత్రాన సరిపోదు, షార్ట్‌హ్యాండ్ మరియు టైపింగ్‌లో మంచి వేగం తప్పనిసరి.
- విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- షార్ట్‌హ్యాండ్: ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 120 పదాల వేగం ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్: కంప్యూటర్‌పై నిమిషానికి 40 పదాల టైపింగ్ వేగం ఉండాలి.
- అనుభవం: ప్రభుత్వ/ప్రభుత్వ రంగ సంస్థలు/చట్టబద్ధమైన సంస్థలలో ప్రైవేట్ సెక్రటరీ/సీనియర్ PA/PA/సీనియర్ స్టెనోగ్రాఫర్ కేడర్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- లా డిగ్రీ (BGL/LLB) ఉన్న అభ్యర్థులకు 3 మార్కుల వెయిటేజీ ఇస్తారు.
ఈ ఉద్యోగంలో ఉన్న ఖాళీలు
సుప్రీం కోర్ట్ జారీ చేసిన ఈ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 30 కోర్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే, ఈ ఖాళీల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. రిజర్వేషన్ల ప్రకారం ఖాళీల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- అన్‌రిజర్వ్‌డ్ (UR): 16
- షెడ్యూల్డ్ కులాలు (SC): 04
- షెడ్యూల్డ్ తెగలు (ST): 02
- ఇతర వెనుకబడిన తరగతులు (OBC – నాన్ క్రీమీ లేయర్): 08
వయస్సు పరిమితి వివరాలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 01.07.2025 నాటికి కింది విధంగా ఉండాలి:
- కనీస వయస్సు: 30 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC (నాన్-క్రీమీ లేయర్), వికలాంగులు మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇతర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న వారికి వయస్సు సడలింపు వర్తించదు.
ప్లై చేసే వారికి అవసరమైన ఫీజు వివరాలు
అభ్యర్థులు దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. UCO బ్యాంక్ అందించిన పేమెంట్ గేట్‌వే ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపసు ఇవ్వబడదు.
- జనరల్ కేటగిరీ అభ్యర్థులు: రూ. 1500/-
- SC/ST/OBC/ఎక్స్-సర్వీస్‌మెన్/వికలాంగులు: రూ. 750/-
ఈ ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపిక జరిగే విధానం
ఈ ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపిక బహుళ దశలలో జరుగుతుంది. ప్రతి దశలోనూ కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి. ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- మొదటి దశ – షార్ట్‌హ్యాండ్ టెస్ట్ (ఇంగ్లీష్): నిమిషానికి 120 పదాల వేగంతో 7 నిమిషాల పాటు డిక్టేషన్ ఇస్తారు. దీనికి 100 మార్కులు ఉంటాయి, కనీస అర్హత మార్కులు 50.
- రెండవ దశ – రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్): ఇందులో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, రాజ్యాంగం, సుప్రీం కోర్ట్ రూల్స్, కంప్యూటర్ నాలెడ్జ్‌పై 100 ప్రశ్నలు ఉంటాయి. దీనికి 100 మార్కులు, కనీస అర్హత మార్కులు 50 (రిజర్వ్‌డ్ కేటగిరీలకు 45).
- మూడవ దశ – కంప్యూటర్ టైపింగ్ టెస్ట్: నిమిషానికి 40 పదాల వేగంతో టైప్ చేయాలి. దీనికి 20 మార్కులు, కనీస అర్హత మార్కులు 10 (రిజర్వ్‌డ్ కేటగిరీలకు 5).
- నాల్గవ దశ – ఇంటర్వ్యూ: పై మూడు దశల్లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 30 మార్కులు, కనీస అర్హత మార్కులు 15 (రిజర్వ్‌డ్ కేటగిరీలకు 13).
ఈ ఉద్యోగంలో లభించే జీతం మరియు ఇతర ప్రయోజనాలు
ఈ కోర్ట్ మాస్టర్ పోస్టుకు ఎంపికైన వారికి పే మ్యాట్రిక్స్‌లోని లెవల్ 11 ప్రకారం అద్భుతమైన జీతం లభిస్తుంది.
- ప్రారంభ బేసిక్ జీతం: రూ. 67,700/-
- ఇతర ప్రయోజనాలు: బేసిక్ జీతంతో పాటు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ దరఖాస్తు చేసే విధానం
అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఇందుకు సంబంధించిన లింక్‌ను సుప్రీం కోర్ట్ అధికారిక వెబ్‌సైట్ అయిన www.sci.gov.in లో అందుబాటులో ఉంచుతారు. ఇతర పద్ధతుల్లో పంపిన దరఖాస్తులు స్వీకరించబడవు
| పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ PDF లింక్ చూడండి. | |
| అధికారిక వెబ్‌సైట్ లింక్ | www.sci.gov.in |
| అధికారిక నోటిఫికేషన్ PDF | Download PDF |